Header Ads

ఎంత పోటుగాడు అయినా 6 నిముషాలు మించి సెక్స్ చేయలేడు అని పరిశోధన ద్వారా నిరూపించారు డాక్టర్స్.. కాబట్టి సెక్స్ వీడియోస్ లో మగాళ్లని చూసి భ్రమ పడద్దు అని హెచ్చరిస్తున్నారు

శృంగార‌మంటే స్త్రీ, పురుషుల మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌కృతి కార్యమ‌ని అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణంగా ఆడ‌, మ‌గ ఇద్ద‌రికీ శృంగారం విష‌యంలో కొన్ని నిర్దిష్ట‌మైన ఆలోచ‌న‌లు, ప్ర‌ణాళిక‌లు ఉంటాయి. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రూ క‌లిసి ర‌తిలో పాల్గొన్న‌ప్పుడు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా ప్ర‌వ‌ర్తిస్తారు. కొంద‌రైతే ఇలాంటి ఇష్టాలు ఏమీ లేకుండానే నేరుగా శృంగారంలోకి దిగిపోతారు. అయితే అది వారి ఇష్టం, అల‌వాటు అనుకోండి, అది వేరే విష‌యం. కానీ ఏ జంట శృంగారంలో పాల్గొన్నా దానికి కొంత స‌మ‌యం అంటూ ఉంటుంది. కొంద‌రు చాలా త్వ‌ర‌గా ముగిస్తే, మరికొంద‌రు సుదీర్ఘంగా కొన‌సాగిస్తారు. అయితే మీకు తెలుసా..? ఏ జంట శృంగారంలో పాల్గొన్నా యావ‌రేజ్‌గా ఆ స‌మ‌యం ఎంత ఉంటుందో..? దాని గురించి ఇప్పుడు చూద్దాం.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ న‌గ‌రంలో ఉన్న క్వీన్స్‌లాండ్ యూనివ‌ర్సిటీ సైకాల‌జిస్టు డాక్ట‌ర్ బ్రెండ‌న్ జియ‌ట్చ్ జంటలు శృంగారంలో పాల్గొనే స‌మ‌యంపై ఓ ఆస‌క్తిక‌ర ప‌రిశోధ‌న చేశారు. అదేమిటంటే… అత‌ను ముందుగా 500 మంది జంట‌ల‌ను ఎంచుకున్నారు. వారికి ఓ స్టాప్ వాచ్ ఇచ్చారు. 4 వారాల స‌మ‌యంలో వారు ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నా అప్పుడు స్టాప్‌వాచ్ ఆన్ చేయాల‌ని, శృంగారం అయిపోయిన వెంట‌నే స్టాప్ వాచ్ ఆఫ్ చేయాల‌ని చెప్పాడు బ్రెండ‌న్. ఈ క్ర‌మంలో జంట‌లంద‌రూ అలాగే చేశారు. చివ‌రిగా తెలిసిన విష‌యం ఏమిటంటే…

ఏ జంట శృంగారంలో పాల్గొన్నా వారి యావ‌రేజ్ ర‌తి స‌మ‌యం 5 నిమిషాల 40 సెకండ్ల‌ని తేలింది. జంట‌లంద‌రినీ ప‌రిశీలిస్తే వారి ర‌తి స‌మ‌యం 33 సెకండ్ల నుంచి దాదాపు 6 నిమిషాల వ‌ర‌కు ఉంద‌ని, కానీ అంద‌రినీ క‌లిపి యావ‌రేజ్‌గా తీసుకుంటే వారి ర‌తి స‌మ‌యం 5 నిమిషాల 40 సెకండ్ల‌ని తేలింది. దీంతోపాటు బ్రెండ‌న్ మ‌రో విష‌యాన్ని కూడా గ‌మ‌నించాడ‌ట‌. అదేమిటంటే వ‌య‌స్సు ఎక్కువగా ఉన్న వారి ర‌తి స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుందని.